- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు సీరియస్.. నోటీసులివ్వాలని ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలో అక్రమ నిర్మాణాలపై నియంత్రణ లేకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ తీసుకున్న చర్యలేమిటని గురువారం జరిగిన వాదనల్లో కోర్టు ప్రశ్నించింది. అక్రమ నిర్మాణాలపై చాలా మంది కోర్టులను ఆశ్రయించినప్పటికీ, అధికారులు ఎటువంటి కదలికను చూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణాల విషయంలో ఇకపై పిటిషన్లు నమోదవ్వొద్దని అధికారులను హెచ్చరించింది. అక్రమ నిర్మాణాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019లో ఎన్ని అక్రమ నిర్మాణాలు గుర్తించబడ్డాయో, ఆయా నిర్మాణాలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లను ఆదేశించింది. కేసును ఏప్రిల్ 15వరకు వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు లేకపోవడంతో కేసుల విచారణ ఆలస్యం అవుతోందని హైకోర్టు ఈ సందర్భంలో అసంతృప్తి వ్యక్తం చేసింది.