- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మూడు నెలల్లో పూర్తి చేయండి.. హైకోర్టు డెడ్ లైన్
దిశ, తెలంగాణ బ్యూరో : థర్డ్ వేవ్ సంగతి ఎలా ఉన్నా రాష్ట్రంలో అర్హులైనవారందరికీ మూడు నెలల్లో టీకాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అన్ని విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బందికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఇకపైన ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను గణనీయంగా పెంచాలని ఆదేశించింది. రాష్ట్రంలోని కరోనా తాజా పరిస్థితులపై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు వ్యాక్సినేషన్‌పై స్పష్టమైన ఆదేశాలనే ఇచ్చింది. కరోనా చికిత్స కోసం వాడుతున్న మందులను ఎమర్జెన్సీ జాబితాలో చేర్చే విషయంలో అక్టోబరు 31వ తేదీకల్లా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ తరఫున హాజరైన న్యాయవాది స్పందిస్తూ, రాష్ట్రంలో ప్రతీ రోజు కనీసంగా మూడు లక్షల చొప్పున టీకాలను ఇవ్వాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 1.62 కోట్ల మందికి ఫస్ట్ డోస్ పూర్తికాగా, ఇందులో 62 లక్షల మందికి సెకండ్ డోస్ కూడా పూర్తయినట్లు తెలిపారు. అర్హులైనవారు ఇంకో 1.20 కోట్ల మంది ఉన్నట్లు వివరించారు. ఈ నెల 16 నుంచి ప్రత్యేక డ్రైవ్ ద్వారా సుమారు పాతిక లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 60 శాతం మందికి ఫస్ట్ డోస్ పూర్తయిందని, సుమారు 38 శాతం మందికి సెకండ్ డోస్ ఇచ్చినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని, ఇప్పటివరకు కేవలం 71 మందికి మాత్రమే పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపారు. థర్డ్ వేవ్ గురించి స్పష్టత లేకపోయినప్పటికీ అన్ని రకాల చర్యలనూ తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్‌లపైన కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు.
మరోవైపు కలర్ కోడెడ్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌లో జరుగతున్న ఆలస్యంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో రెండుసార్లు హైకోర్టు స్పష్టంగా చెప్పినా సమర్పించకపోవడాన్ని తప్పుపట్టింది. ప్రభుత్వం ఉన్నత స్థాయిలో విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవాది వివరించారు. దీనికి స్పందించిన బెంచ్ ఈ నెల 30వ తేదీ లోగా రూపొందించాల్సిందేనని ఆదేశించింది.
న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలుచేయకపోతే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని మందలించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం కరోనా మందులను అత్యవసర జాబితాలో ఇంకా చేర్చకపోవడంకపై హైకోర్టు ఆగ్రహం వ్యక్త, చేసి,ది. ఒకవైపు రోజురోజుకూ కరోనా కారణంగా చనిపోతున్నవారి సంఖ్య పెరిగిపోతూ ఉన్నదని, ఇంకెప్పుడు చేరుస్తారని ప్రశ్నించింది. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబరు 31వ తేదీకల్లా దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.