- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీఫ్ సెక్రటరీ, డీజీపీ సహా, ఆరుగురికి హైకోర్టు నోటీసులు
దిశ, ఏపీ బ్యూరో: స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటుకు సంబధించిన, జీవో 41ని రద్దు చేయాలంటూ, హైకోర్టులో ప్రకాశం జిల్లా వాసి, ఒకరు పిటీషన్ దాఖలు చేసారు. స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోకు చట్టబద్దమైన అనుమతి లేదని, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో నమోదు చేసే కేసులు న్యాయపరంగా చెల్లవని పిటీషనర్ తన వాదనను కోర్టుకు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం, ఎస్ఈబీ ఏర్పాటు చేసారో చెప్పాలి అంటూ, ప్రభుత్వంలోని ఆరుగురు అధికారులను హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
నోటీసులు ఇచ్చిన వారిలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ డీజీపీ సహా, మరో ముగ్గురికి కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. ఎస్ఈబీ ఏర్పాటుపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై, విచారణను, హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది. అయితే ఇసుక అక్రమ రవాణా, మద్యం అక్రమ రవాణాని అరికట్టేందుకు ప్రభుత్వం, ఈ స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో అనే విభాగం ఏర్పాటు చేసి, 6 వేల మంది వరకు ఇందులో ఉంచనుంది. అయితే పోలీసు, విజిలెన్స్ ఇతర శాఖలు ఉండగా, మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త శాఖ దండగ అని, అది కాక, దీనికి చట్టబద్దత ఉండదు అని పిటీషనర్ వాదన.
ఇక మరో పక్క, మెడికల్ పీజీ సీట్ల రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ, జారీ చేసిన జీవో 57 వల్ల రిజర్వేషన్లు 78శాతానికి చేరడంతో, హైకోర్టును ఆశ్రయించారు. ఓపెన్ క్యాటగిరీ విద్యార్ధులు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, హైకోర్ట్ నోటీసులు ఇచ్చింది. జీవో 57పై వైద్య విద్యార్ధులు మండి పడుతున్నారు. జీవో 57 వల్ల రిజర్వేషన్లు, 78 శాతానికి పెరిగి పోయాయని, దీని వల్ల ఓపెన్ క్యాటగిరీ విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. కౌన్సిలింగ్ లో సీటు వచ్చిన తరువాత, ఇప్పుడు సీటు పోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.