- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో గెస్ట్ హౌస్ : హైకోర్టు కీలక ఆదేశాలు
by srinivas |
X
దిశ, విశాఖపట్నం: విశాఖ నగరంలోని కాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ అమరావతి ఐకాస నేత గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. గెస్ట్‌హౌస్‌కు కేటాయించిన 30 ఎకరాల్లో ఉన్న చెట్లు నరకవద్దని, అతిథిగృహం నిర్మాణం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. గ్రేహౌండ్స్‌కు ఇచ్చిన స్థలంలో అతిథిగృహం సరికాదని పిటిషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ వాదించారు. గ్రేహౌండ్స్ నక్సల్స్, టెర్రరిస్ట్ వ్యతిరేక దళం, రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంటుందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
Advertisement
Next Story