జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ

by srinivas |   ( Updated:2021-09-13 06:16:28.0  )
జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ
X

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వం విడుదల చేసే జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదన్న నిర్ణయంపై పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వారం రోజులపాటు వాయిదా వేసింది. జీవోలు ఆన్‌లైన్‌లో ఉంచకూడదంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిన వెంటనే తాము హైకోర్టులో పిటిషన్లు వేసినట్లు పిటిషనర్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వం జీవో 100ను విడుదల చేసిందని కోర్టుకు తెలియజేశారు.

జీవో నెంబర్ 100లో సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ పేరుతో జీవోలను విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. ఈ నిర్ణయం సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, 8కు విరుద్ధంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఇంద్రనీల్ బాబు, యలమంజుల బాలాజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ పేరుతో ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో పెట్టకపోవడం ఏమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పిటిషనర్లు తాజా పిటిషన్ దాఖలు చేసినందున.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రాష్ట్ర ధర్మాసనం వారం రోజులపాటు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed