- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దర్శకుడు శంకర్ భూములపై హైకోర్డు విచారణ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సర్కార్‌కు మరోసారి హైకోర్టులో మొట్టికాయలు పడ్డాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఎవరో ఒకరు ఏదో ఒక అంశాన్ని వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదస్పదమై హైకోర్టు చివాట్లు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా టాలివుడ్ దర్శకుడు నిమ్మల శంర్‌కు కేటాయించిన భూములపై హైకోర్టు విచారణ చేపట్టింది.
దర్శకుడు ఎన్.శంకర్ తాను హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియోను నిర్మించుకుంటానని, అందుకు తనకు అవసరమైన భూమి కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించిన సర్కార్.. రంగారెడ్డి జిల్లా మోకిల్లలో ఎకరానికి రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను కేటాయించింది. అయితే దీనిపై ఒకరు హైకోర్టుకు ఎక్కారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి కేవలం రూ.25 లక్షలకే ఎలా కట్టబెట్టారో తెలపాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఎకరా రూ.50 లక్షలు ఉన్న భూమిని కేవలం రూ5 లక్షలకే ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. భూ కేటాయింపుపై కేబినెట్‌లో ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని అడిగింది. ఏజీ క్వారంటైన్ లో ఉన్నందున తనకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరుఫు న్యాయవాది కోరడంతో న్యాయస్థానం ఈ కేసు విచారణను ఈనెల 27వరకు వాయిదా వేసింది.