అమరావతి పై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు..

by srinivas |
అమరావతి పై హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు..
X

దిశ, ఏపీ బ్యూరో: రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టులో రెండోరోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా అమరావతిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమరావతి రైతుల రాజధానే కాదు.. ఏపీ ప్రజలందరి రాజధాని. 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. రాజధాని అమరావతి.. విశాఖ, కర్నూలు సహా అందరిదీ. స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడడం అంటే కేవలం వాళ్ల కోసం పోరాడడం మాత్రమే కాదు, దేశ ప్రజలందరి కోసం పోరాడడం. ఆ స్వాతంత్ర్యం కేవలం సమరయోధులకు సంబంధించినది మాత్రమే కాదు, దేశ ప్రజలందరికీ చెందినది’ అని సీజే మిశ్రా స్పష్టం చేశారు. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు.

అమరావతికి సంబంధించిన పలు కీలక అంశాలను శ్యామ్ దివాన్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని కోసం రైతులు తమ జీవనోపాధిని త్యాగం చేశారని అందుకు గల కారణాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కోరారు. అలాగే అమరావతిని అభివృద్ధి చేయాలని.. గత ప్రభుత్వం ఇచ్చిన న్యాయబద్ధమైన హామీలను ప్రస్తుత ప్రభుత్వం వెంటనే నెరవేర్చేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాజకీయ విద్వేషాలతో అమరావతిని ఘోస్ట్ క్యాపిటల్‌గా రాష్ట్ర ప్రభుత్వం మార్చేసిందని న్యాయవాది శ్యామ్ దివాన్ వాదించారు.

Advertisement

Next Story

Most Viewed