- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి పెద్దిరెడ్డికి ఊరట.. మీడియాతో మాట్లాడొచ్చు
దిశ, వెబ్‌డెస్క్: ఎస్ఈసీ అంక్షల నుంచి ఏపీ హైకోర్టులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఊరట లభించింది. పెద్దిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. పంచాయతీ ఎన్నికలు ముగిసే వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని.. మీడియాతో మాట్లాడకుండా చూడాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ డీజీపీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది.
మంత్రి పెద్దిరెడ్డి ఇంటికే పరిమితం చేయాలన్న ఆదేశాలను ధర్మాసనం రద్దు చేసింది. ఆయన మీడియా సమావేశం నిర్వహించవచ్చని తెలిపిన న్యాయస్థానం.. ఎస్ఈసీ, కమినషర్ లక్ష్యంగా కామెంట్స్ చేయొద్దని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని హైకోర్టు సూచించింది. ఎన్నికల షెడ్యూల్ పూర్తయ్యేవరకు కోర్టు నియమాలు పాటించాలని స్పష్టం చేసింది.