ఇటలీ, ఇంగ్లండ్‌లను కుదిపేసిన కరోనా మహమ్మారి

by Shyam |
ఇటలీ, ఇంగ్లండ్‌లను కుదిపేసిన కరోనా మహమ్మారి
X

కరోనా మహమ్మారి ఇటలీ, ఇంగ్లండ్ దేశాలను పట్టి కుదిపేస్తోంది. పగబట్టినట్టుగా జనాల ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలిగొంటోంది. పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తూ, వందల మందికి సోకుతోంది. చైనాలో వెలుగుచూసిన ఈ మహమ్మారి మహోగ్ర రూపంతో యూరోపియన్ దేశాలపై విరుచుకుపడుతోంది.

ఇటలీ కరోనా వివరాల్లోకి వెళ్తే.. నిన్న ఒక్క రోజే ఏకంగా 793 మంది కరోనా కాటుకు బలి కావడం ఆ దేశాన్ని భయాందోళనలకు గురి చేస్తోంది. దీంతో ఇటలీలో మృతుల సంఖ్య 4,825కు చేరింది. కరోనా వైరస్ వెలుగు చూసిన తరువాత ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆ వైరస్ కనుగోబడిన చైనాలో కూడా ఈ స్థాయిలో మరణాలు నమోదు కాకపోవడం విశేషం.

చైనాలో డిసెంబర్ 31న కరోనా వైరస్ గుర్తించగా, నాటి నుంచి నేటి వరకు 3255 మంది మృతి చెందారు. అక్కడి నుంచి వ్యాప్తి చెందిన ఇటలీలో మాత్రం కేవలం రెండు రోజుల్లోనే 1420 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఫ్యాషన్ కేంద్రమైన మిలన్ నగర సమీపంలోని ఉత్తర లోంబార్డీ ప్రాంతంలోనే ఏకంగా 3000 మంది మృత్యువాత పడడం పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతోంది.

మరోవైపు కరోనా వైరస్ ఇంగ్లండ్‌పై కూడా ప్రతాపం చూపిస్తోంది. నిన్న ఒక్కరోజే బ్రిటన్‌లో 55 మంది మృతి చెందడం విశేషం. ఇప్పటి వరకు బ్రిటన్‌లో కరోనా బారినపడి 177 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితులు నాలుగు వేల మందికిపైగా ఉన్నారని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ రెండు దేశాలు షట్‌డౌన్ అమల్లోకి తీసుకొచ్చాయి. బయట కనిపిస్తే భారీ జరిమానాలతో షాకిస్తున్నాయి.

మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా బాధితుల సంఖ్య 3 లక్షల మందికి పైగా సోకితే.. సుమారు 13 వేల మందికిపైగా మృతి చెందారు. భారత్ జనతా కర్ఫ్యూకి పిలుపునిస్తే… వివిధ దేశాలు షట్‌డౌన్ ప్రకటించాయి.

Tags: italy, england, coronavirus, china, shut down, corona deaths

Advertisement

Next Story

Most Viewed