- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘వరల్డ్ క్యాన్సర్ డే’ ఉత్సవాల్లో మెరిసిన సెలెబ్రిటీలు
దిశ, వెబ్‌డెస్క్ : వరల్డ్ క్యాన్సర్ డేను పురస్కరించుకుని ఆదివారం నెక్లెస్‌రోడ్‌లో అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. అందుకోసం క్యాన్సర్ సూపర్ కారు ర్యాలీని నిర్వహించారు. దీనికి టాలీవుడ్ హీరోయిన్లు కెథరిన్ థెరిస్సా, మాళవిక శర్మలు హాజరయ్యారు. 2021 క్యాన్సర్ అవెర్ నెస్ కోసం తలపెట్టిన సూపర్ కారు ర్యాలీని నటి మాళవిక శర్మ జెండా ఊపి ప్రారంభించారు.
అనంతరం అపోలో ఇనిస్టిట్యూట్ తరఫున ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న వారిని నటి కెథరిన్ థెరిస్సా సన్మానించారు. ‘ఐ యామ్ అండ్ ఐ విల్’ అనే నినాదంతో ప్రారంభించిన కారు ర్యాలీని నెక్లెస్ రోడ్ (ఐమాక్స్ సర్కిల్) నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం.1, ఎల్వీపీఈఐ మార్గ్, కేబీఆర్ పార్క్ గుండా అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మీదుగా జూబ్లీహిల్స్ వరకు నిర్వహించారు. ఈ అవెర్‌నెస్ ర్యాలీలో అపోలో క్యాన్సర్ ఇనిస్టిట్యూట్స్, కన్సల్టెంట్ అంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కరణ్ రెడ్డి సైతం హాజరయ్యారు.
ఈ సందర్భంగా అపోలో క్యాన్సర్ హాస్పిటల్స్ డైరెక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ.. 70వరకు క్యాన్సర్లు మనజీవనశైలి కారణంగానే ఏర్పడుతున్నాయన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ధూమపానానికి దూరంగా ఉండటం వంటివి చేస్తే క్యాన్సర్ రోగాలు రాకుండా నివారించవచ్చునని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.