- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను రోజు అదే తాగుతాను.. నా గ్లామర్ సీక్రెట్ అదే అంటున్న బ్యూటీ
దిశ, వెబ్ డెస్క్: చిత్ర పరిశ్రమ లో నిలదొక్కుకోవాలంటే హీరోయిన్లు ఎప్పుడు తమ గ్లామర్ ని పెంచుకుంటూనే ఉండాలి. ఆ గ్లామర్ కోసం హీరోయిన్లు నిరంతరం జిమ్ లు, డైట్లు అంటూ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. వారి గ్లామర్ రహస్యం ఏంటి అని ఎవరైనా అడిగి తే నవ్వుతూ తప్పించుకొంటారు. కానీ ముద్దు గుమ్మ యామి గౌతమ్ మాత్రం నా గ్లామర్ రహస్యం ఇదే అంటూ బహిరంగంగా చెప్పుకొచ్చింది. ‘నువ్విలా’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యామి ఆ తర్వాత ‘గౌరవం’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. ఈ దెబ్బతో బాలీవుడ్ లో పాగా వేసిన అమ్మడు అక్కడ స్టార్ హీరోల సరసన నటిస్తూ బాగానే పాపులర్ అయ్యింది.
ఇకపోతే అమ్మడు ఎప్పుడు సోషల్ మీడియా లో హీటెక్కించే ఫొటోలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమ్మడి గ్లామర్ రహస్యం ఏంటి అనేది నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది. “ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ తో పాటు గంజి తాగడమే తన గ్లామర్ సీక్రెట్ అని, రోజు విడిచి రోజు చద్దన్నం తినడం వలన ఆరోగ్యంగా ఉంటానని చెప్పుకొచ్చింది. అంతేకాదు తనలా అందంగా ఉండాలనుకొనేవాళ్ళు వీటిని ట్రై చేయమని” కూడా టిప్స్ ఇచ్చింది. ప్రస్తుతం యామి ‘భూత్ పోలీస్’ ‘దాస్వి’ ‘ఎ థర్స్ డే’ వంటి సినిమాల్లో నటిస్తోంది.త్వరలోనే ఒక మంచి ప్రాజెక్ట్ తో తెలుగులోనూ తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతుందట ఈ ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ.