- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భార్యకు నా చెల్లి భర్తతో అఫైర్ ఉంది – హీరోయిన్ భర్త
దిశ, వెబ్‌డెస్క్: రాజ్ కుంద్రా.. ప్రస్తుతం బీ టౌన్ లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఒకప్పుడు ఎవరికి తెలియని ఈయన స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టిని వివాహమాడి స్టార్ సెలెబ్రిటీ గా మారిపోయాడు. ఇక శిల్పను పెళ్లాడకముందే రాజ్ కుంద్రా కు కవితతో వివాహమైంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత కవితతో విడిపోవడానికి గల కారణాన్ని ఆయన బయటపెట్టారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆయన తన మొదటిభార్యకు విడాకులు ఇవ్వడానికి శిల్పాశెట్టి కారణంకాదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే వారు విడిపోవడానికి కారణమేంటో చెప్పారు.
” నేను నా మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి శిల్పా కారణం కాదు. కవితకు నా చెల్లెలి భర్తతో వివాహేతర సంబంధం ఉంది. ఆ విషయం మా ఇంట్లో వారందరికీ తెలుసు. అప్పట్లో మేము లండన్ లో మా పేరెంట్స్ తో ఉండేవాళ్ళం.. మాతోపాటే మా చెల్లి.. ఆమె భర్త కూడా ఉండేవారు. దాంతో కవితకు నా చెల్లెలు భర్తతో రిలేషన్ పెరిగింది. బిజినెస్ పనులపై ఎప్పుడైనా టూర్ కు వెళితే.. కవిత ప్రవర్తన మారేది. ఈ విషయాన్ని మా ఇంట్లో వారందరు నాకు చెప్పారు.. చివరికి మా కారు డ్రైవర్ కూడా వారి గురించి అసహ్యంగా చెప్పాడు. దీంతో మా చెల్లిని, అతనిని ఇండియాకు పంపేసాం. అయినా కవిత ప్రవర్తన మారలేదు. రహస్యంగా ఒక ఫోన్ కొని, అందులో నుండి అతనికి మెసేజ్ లు పంపేది. ఒకరోజు ఆ ఫోన్ నాకు దొరికింది. అందులోని మెసేజ్ లు చూసి నా హృదయం ముక్కలయిందంటూ.. తన మొదటి భార్య ఇల్లీగల్ ఎఫైర్ ని బయట పెట్టాడు.
తన మొదటి భార్యకు విడాకులివ్వడంలో శిల్పా ప్రమేయం ఏమిలేదని, తన గురించి శిల్పకు అన్ని తెలుసని.. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం రాజ్ కుంద్రా తన మొదటి భార్య కవిత మీద చేసిన సంచలన వ్యాఖ్యలు బాలీవుడ్ లో పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి.