- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అంటే సుందరానికీ'.. నజ్రియా హ్యాండ్ ఇచ్చినట్లేనా?
దిశ, వెబ్ డెస్క్: దేశం లో కరోనా కోరలు చాస్తోంది. చిత్ర పరిశ్రమ పై మహమ్మారి గట్టి దెబ్బ వేసింది. ఇప్పుడిప్పుడే కోలుకొంటున్న ఇండస్ట్రీ పై కరోనా కాటు మళ్లీ మొదలయ్యింది. థియేటర్లు మూత పడ్డాయి… సినిమాలు వాయిదా పడ్డాయి.. షూటింగ్లు సైతం ప్యాకప్ చెప్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నా కరోనా కారణంగా అవి కూడా వాయిదా పడ్డాయి. ఇక కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు కరోనా జాగ్రత్తలు తీసుకొంటూ షూటింగ్ లు జరుపుతున్నారు. అందులో అల్లు అర్జున్ ‘పుష్ప’ , నాని ‘అంటే సుందరానికీ’ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాల ద్వారా నజ్రియా నజీమ్- ఫహద్ ఫాజిల్ జంట తెలుగుతెరకు పరిచయమవుతున్నారు.
ఫహద్ ఫాజిల్ ‘పుష్ప’ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ లో అడుగు పెట్టారు. ఆయనతో పాటే నజ్రియా నాని సినిమా సెట్ లో అడుగు పెట్టారు. అయితే హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువవుతున్న కారణంగా నజ్రియా షూటింగ్ కి మధ్యలో బ్రేక్ చెప్పిందని సమాచారం. ఇలాంటి సమయంలో తానూ షూటింగ్ కి రాలేననని తేగేసి చెప్పిందట.. ఇక హీరోయిన్ లేకుండా షూట్ చేయలేమని నాని సైతం షూట్ ని క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అంటే సుందరానికీ ప్యాకప్ చెప్పాక నజ్రియా తన భర్త ఫహద్ తో కలిసి చెన్నయ్ కి వెళ్లారని తెలుస్తోంది. కరోనా కారణంగా నానికి నజ్రియా గట్టి హ్యాండ్ ఇచ్చినట్లే అని అర్ధమవుతుంది.