- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది నిజమే.. నాకు నా తండ్రికి కరోనా: విశాల్
దిశ, వెబ్ డెస్క్: కోలీవుడ్‌లో కరోనా కలకలం సృష్టస్తోంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విషాల్ కు కరోనా సోకినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈనేపథ్యంలో విశాల్ స్పందిస్తూ తనతోపాటు తన తండ్రీకి కరోనా సోకిందని ఆయనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించారు.
”అవును! ఆ వార్త నిజం. కరోనా పరీక్షల్లో మా నాన్నకు పాజిటివ్ అని తేలింది. ఆయనకు సహాయకుడిగా ఉన్నందుకు నాకూ కరోనా సోకింది. తీవ్ర జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడ్డా. నా మేనేజర్‌కు కూడా ఈ వ్యాధి సోకింది. మేమంతా ఆయుర్వేద ఔషధాలు వాడి కేవలం వారం రోజుల్లో ప్రమాదం నుంచి బయటపడ్డాం. ప్రస్తుతం మేమంతా ఆరోగ్యంగా ఉన్నామని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా” అని విశాల్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం విశాల్ ‘డిటెక్టివ్2’తో పాటు ‘చక్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రాల షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.