హీరో సూర్యకు కరోనా పాజిటివ్..

by Shyam |
హీరో సూర్యకు కరోనా పాజిటివ్..
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. ‘నేను కరోనాతో బాధపడుతున్నాను. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాను. నన్ను కలిసిన వారందరూ కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరుతున్నాను. మన జీవితం ఇంకా సాధారణ స్థితికి రాలేదనే విషయాన్ని అందరు గ్రహించాలి. కరోనాకు భయపడకూడదు.. అలా అని అజాగ్రత్తగా ఉండకూడదు. నాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ సూర్య ట్వీట్ చేశారు.

సూర్యకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సూర్య కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన‘ఆకాశం నీ హద్దురా’ మూవీ మంచి విజయాన్ని సాధించింది.

Advertisement

Next Story