- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండో పెళ్లిపై సుమంత్ క్లారిటీ: జీవితం.. విడాకుల తర్వాత 'మళ్లీ మొదలైంది' అంటూ
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడంటూ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లి వార్తపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం తనదైన రీతిలో స్పందించి ఇంకా వైరల్ గా మార్చాడు. దీంతో ఈ వైరల్ న్యూస్ కాస్తా చివరికి సుమంత్ కు చేరడంతో ఆయన ఈ పుకార్లకు చెక్ పెట్టాడు. తన రెండో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇస్తూ ఒక వీడియో ను రిలీజ్ చేశారు. తాను రెండో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేశారు.
” నేను రెండో పెళ్లి చేసుకుంటున్నాను అంటూ వస్తున్న వార్తలను విన్నాను. అదంతా అబద్ధం. నేను రెండో పెళ్లి చేసుకోవడం లేదు. ఆ వెడ్డింగ్ కార్డు నేను కొత్తగా చేస్తున్నప్రాజెక్టుకు సంబంధించింది. పొరపాటున అది లీక్ కావడంతో ఇంత రచ్చ జరిగింది. దాన్ని మీరంతా తప్పుగా అర్థం చేసుకున్నారు.” అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా తాజాగా ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశాడు. ‘మళ్లీ మొదలైంది’ అనే టైటిల్ ని ఖరారు చేస్తూ రివీల్ చేసిన ఈ పోస్టర్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. జీవితం.. విడాకుల తర్వాత అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ పుకార్లు నిజంకాదని తేలిపోయింది.
🙏🏼 Just clearing the air, for those who are interested, and for dear @RGVzoomin who has such immense concern for me 😊 https://t.co/ROrftZaadc pic.twitter.com/TS72kbdNA8
— Sumanth (@iSumanth) July 29, 2021