- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలీజ్‌కు సిద్ధంగా బ్రహ్మాజీ సన్ వెబ్ సిరీస్
దిశ, వెబ్‌డెస్క్: ‘పిట్టకథ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు మరో మూడు సినిమాలు లైన్‌లో పెట్టాడు. అవి కూడా పూర్తిగా డిఫరెంట్ జోనర్‌లో ట్రై చేస్తున్నట్లు తెలిపాడు. డాన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుండగా..మరో రెండు సినిమాలు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్, మర్డర్ మిస్టరీగా రాబోతున్నట్లు చెప్పాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్ కూడా జనవరిలో ప్రారంభం కాబోతుండగా.. నిత్య శెట్టితో కలిసి చేసిన వెబ్ సిరీస్ త్వరలోనే విడుదల కాబోతున్నట్లు వెల్లడించాడు.
నాన్న బ్రహ్మాజీ కారణంగా ప్రారంభంలో అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడం తన చేతుల్లోనే ఉందని.. అందుకోసం కష్టపడతానని చెప్పాడు సంజయ్ రావు. తనకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపాడు. కేవలం హీరోగానే కాకుండా, మంచి కథ ఉండి పెద్ద బడ్జెట్ సినిమా అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా నటించేందుకు సిద్ధమేనన్నారు సంజయ్ రావు.