డిఫరెంట్ లుక్‌తో నితిన్ ‘మాస్ట్రో’.. రిలీజ్ డేట్ ఫిక్స్

by Jakkula Samataha |   ( Updated:2021-03-29 23:10:02.0  )
డిఫరెంట్ లుక్‌తో నితిన్ ‘మాస్ట్రో’.. రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘రంగ్ దే’ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్‌టాక్ తెచ్చుకోవడంతో హీరో నితిన్ మంచి జోరు మీదున్నాడు. తన నెక్ట్స్ మూవీ ప్రాజెక్టుకు సంబంధించి ఫ్యాన్స్‌కు అప్డెట్ ఇచ్చాడు. మార్చి-30న నితిన్ బర్త్ డే. ఈ సందర్భంగా నితిన్ నటిస్తున్న నెక్ట్స్ మూవీకి ‘మాస్ట్రో’ అనే టైటిల్ ఖరారు చేయడంతో పాటు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అందాధున్’ రీమెకే ఈ ‘మాస్ట్రో’. వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా ప్లే చేసిన రోల్‌లో నితిన్ నటించనున్నాడు. మనోడికి జోడిగా నభా నటేశ్, అందాధున్‌లో కీ రోల్ ప్లే చేసిన ‘టబు’ పాత్రను తెలుగులో తమన్నా పోషించనున్నట్లు సమాచారం.

మాస్ట్రో మూవీని నితిన్ త‌న సొంత బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్‌లో నిర్మిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా.. సుధాకర్ రెడ్డి, నికితారెడ్డిలు నిర్మాతలు. జూన్-11ను రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేసింది చిత్ర బృందం. కాగా, మాస్ట్రో ఫ‌స్ట్‌లుక్‌ అదిరిపోయింది. చేతిలో వాక్ స్టిక్, కళ్లజోడు, హ్యాండ్ బ్యాగ్‌తో న్యూలుక్‌లో నితిన్ ఒదిగిపోయాడు. పోస్టర్ బ్యాక్ డ్రాప్‌లో రక్తపు మరకలు సినిమా క్రైం థ్రిల్లర్ జోనర్ అని చెప్పకనే చెబుతోంది.

Advertisement

Next Story