నవంబర్‌లో 7,000 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించిన హీరో ఎలక్ట్రిక్!

by Harish |
hero electric bicke
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ నవంబర్‌లో మొత్తం 7,000 యూనిట్లను విక్రయించినట్టు బుధవారం వెల్లడించింది. 2020లో కంపెనీ మొత్తం 1,169 యూనిట్లను విక్రయించింది. దేశీయంగా తాము సమర్థవంతంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొనసాగుతున్నాము. వినియోగదారుల నుంచి మెరుగైన విశ్వాసాన్ని పొందుతున్నామని హీరో ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణలు, వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ వంటి పరిణామాలతో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. రానున్న రోజుల్లో మరింత వేగవంతమైన విక్రయాలను సాధించగలమనే నమ్మకం ఉందని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాల గిరాకీ గణనీయంగా పెరుగుతుండటం గమనిస్తున్నాం. దేశీయంగా డిమాండ్‌కు తగిన స్థాయిలో వాహనాలను ఉత్పత్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాదిలో మెరుగైన వృద్ధిని సాధిస్తామని కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed