2022లో 10 వేల ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల : హీరో కంపెనీ

by Harish |
petrol
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ)కు సరిపడా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇంకా చాలామంది ఈ-వాహనాలను కొనేందుకు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ వచ్చే ఏడాదిలో 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. భారీ స్థాయిలో ఈవీ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు మాసివ్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గత రెండేళ్లుగా పెట్రోల్ ధరలు భారీగా పెరగడం, తక్కువ వ్యయంతో ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తుండటం సానుకూలంగా ఉన్నాయి. ఇదే సమయంలో ఈవీ వాహనాలకు ఛార్జింగ్ అవసరాలను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ చెప్పారు. దీనికితోడు కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలకు తగిన ప్రోత్సాహకాలు అందించడం కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు 1,650 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, 2022 చివరి కల్లా 20 వేల ఛార్జింగ్ స్టేషన్లను పూర్తి చేయాలనే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్టు సోహిందర్ వివరించారు.

Advertisement

Next Story