- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘డెలివరింగ్ స్మైల్స్: పాత మొబైల్స్ ఉన్నాయా? పేద విద్యార్థికి అందిస్తారా?
దిశ, ఫీచర్స్ : భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 40 నుంచి 70% మంది పిల్లలకు ఇప్పటికీ డిజిటల్ పరికరాలకు యాక్సెస్ లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ సెక్టర్ 2020-21 లో చేపట్టిన సర్వే ద్వారా ఈ గణాంకాలు వెల్లడి కాగా అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోని పిల్లలు ఈ జాబితాలో ఉన్నారు.
దేశవ్యాప్తంగా పాఠశాలలు డిజిటల్‌గా పనిచేస్తున్నందున అత్యుత్తమ డిజిటల్ పరికరాలకు యాక్సెస్ ఉన్న పిల్లలు డిజిటల్ జీవితానికి అనుగుణంగా మారినప్పటికీ, కుటుంబంలో ఒక్క స్మార్ట్‌ఫోన్ కూడా లేని పిల్లలు ఇప్పటికీ ఉండటం గమనార్హం. ఈ డిజిటల్ విభజన పిల్లల్ని వారి తోటి వారి కంటే రెండేళ్లు వెనుకబడేలా చేస్తోంది. అంతేకాదు పాఠశాలల్ని విడిచిపెట్టడానికి, ఉద్యోగాలు చేసేందుకు, చిన్న వయసులోనే వివాహం చేసుకోవడానికి దారితీసింది. మరోవైపు సిటీలోని కుటుంబాలు కొత్త వెర్షన్ ఫోన్లు వచ్చినప్పుడల్లా.. పాతదాన్ని పడేసి, న్యూ డివైజ్‌కు అప్‌గ్రేడ్ కావడానికి అస్సలు ఆలోచించరు.
ఈ క్రమంలో ఆ ఉపయోగపడని పాత స్మార్ట్‌ఫోన్‌ను విరాళంగా ఇవ్వడం వల్ల ఒకరి భవిష్యత్తు మారిపోతుందని మనం ఎప్పుడైనా ఊహించామా? కానీ అమెజాన్ ఆ దిశగా అడుగులు వేసింది. ‘డెలివరింగ్ స్మైల్స్’ పేరుతో ఈ ఇనిషియేటివ్ ప్రారంభించిన అమెజాన్, డిజిటల్ డివైడ్ తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ ద్వారా, అమెజాన్ ఇండియా అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులు, యువకులకు డిజిటల్ పరికరాల సహకారాన్ని అందిస్తుంది.
150కి పైగా లాభాపేక్షలేని సంస్థల భాగస్వామ్యంతో అమెజాన్ నేరుగా 20,000 డిజిటల్ పరికరాలను నిరుపేద యువతకు అందించింది. అంతేకాదు ఇందుకోసం అమెజాన్ కస్టమర్స్ Amazon Payలో నగదు విరాళాన్ని కూడా అందించవచ్చు లేదా వారి పాత మొబైల్ ఫోన్స్ అందించవచ్చు. ఆ మొబైల్స్‌ను పునరుద్ధరించి, అర్హులైన విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ఉదాహరణకు 4వ తరగతి చదువుతున్న ఆనంద్ కుటుంబం లాక్‌డౌన్ సమయంలో ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంది. మొబైల్ అందుబాటులో లేక ఆన్‌లైన్ విద్యకు యాక్సెస్ లేకపోవడంతో ఆనంద్ చాలా బాధపడ్డాడు.
ఈ నేపథ్యంలో ఖుషీ NGO భాగస్వామ్యంతో, Amazon India డెలివరింగ్ స్మైల్స్ ఇనిషియేటివ్ ఆ కుర్రాడికి మొబైల్ అందించింది. ప్రస్తుతం ఆనంద్ కేవలం ఆన్‌లైన్ టాబ్లెట్ గణితాన్ని నేర్చుకోడమే కాకుండా యూట్యూబ్‌లో ప్రతిరోజూ కొత్త క్రాఫ్ట్స్ స్వయంగా నేర్చుకుంటున్నాడు. ఇలా ఆనంద్ ఒక్కడే కాదు వేలాదిమంది డెలివరింగ్ స్మైల్స్‌తో డిజిటల్ డివైజెస్ పొందుతూ తమ విద్యను కొనసాగిస్తున్నారు. కాబట్టి, మరోసారి మీ పరికరం పాడైపోయిందని మీరు భావించినా, లేదా ఇంట్లో వృథాగా పడిఉన్నా అది ఒకరి విద్యకు, భవిష్యత్తుకు ఎంతగా ఉపయోగపడుతుందో ఆలోచించండి.