- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
"రావణుడి పుత్రులు గాంధీని విమర్శిస్తున్నారు"
జాతిపిత మహాత్మా గాందీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యా్ఖ్యలు పార్లమెంటును పట్టి కుదిపేశాయి. గాంధీని అవమానించే విధంగా హెగ్డే చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపాయి. లోకసభలో విపక్షాలు హెగ్డే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
హెగ్డే వ్యా్ఖ్యలపై కాంగ్రెస్ అధిర్ రంజన్ ఛౌదరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రావణ్ కి ఔలాద్ (రావణాసురుడి పుత్రులు)” గాంధీని అవమానిస్తారా? అంటూ బీజేపీ సభ్యులపై విరుచుకుపడ్డారు. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అధికార విపక్షాలు నినాదాలతో హోరెత్తించడంతో లోక్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వ్యక్తిని ఈ రీతిన అవమానించడం సరైన చర్యా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో ఛైర్ ఆయన వ్యాఖ్యలు సరికాదని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ ఎంపీలు శాంతించలేదు.
మరోవైపు రావణాసురుడి పుత్రులన్న వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బల్లలు చరుస్తూ దీనిపై నిరసన వ్యక్తం చేశారు. ఇరు పక్షాలు పోటాపోటీగా నినాదాలు చేశాయి. దీంతో స్పీకర్ సభను సజావుగా కొనసాగించేందుకు సహకరించాలని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఇరు పక్షాలు శాంతించలేదు. బీజేపీ నినాదాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వాక్ అవుట్ చేసింది.