- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, హైదరాబాద్: నిజాం కాలం నుంచే అత్యంత ప్రాధాన్యత కలిగిన భవనాలు హైదరాబాద్ కోఠి ఉమెన్స్, మెడికల్ కాలేజీలు. ఈ కాలేజీల్లో భారీ వృక్షాలు కొన్ని దశాబ్దాలుగా పెరుగుతున్నాయి. ఇటీవల వాటిని కళాశాల యాజమాన్యం నేలమట్టం చేసింది. ఓ వైపు ప్రభుత్వాధినేత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 33 శాతం అడవులు లేనందున వాతావరణంలో సమతుల్యత దెబ్బతింటున్నట్టు, అందుకే హరితహారం చేపట్టి మొక్కలు నాటుతున్నట్టు చెబుతుండగా, మరో వైపున కళాశాల యాజమాన్యం భారీ వృక్షాలను నేలమట్టం చేయడం సబబేనా అంటూ పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు సమీపంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీ కాలనీలో మొక్కలను తొలగించినందుకు ప్రభుత్వ అధికారులు భారీ స్థాయిలో జరిమానా విధించారు. మరి ఇక్కడ భారీ వృక్షాలను తొలగించింనందుకు అధికారులు చర్యలు ఎందుకు తీసుకోరని పలువురు అంటున్నారు.
అనుమతి లేకుండానే నరికివేత..
సరిగ్గా పది రోజుల కిందట హైదరాబాద్ నగరం నడి మధ్యన గల కోఠి ఉమెన్స్ కళాశాల, మెడికల్ కళాశాల పరిసరాలలో ఖేల్ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా కళాశాల ఆవరణలో స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్ తదితర క్రీడా సంబంధిత ఏర్పాట్ల నిమిత్తం కొన్నేళ్లుగా కాలేజీల్లో పెరుగుతున్న దాదాపు 40- 50 చెట్లను యాజమాన్యం నేలమట్టం చేసింది. ప్రస్తుతం ఆ ప్రదేశాలను చూస్తే.. గతంలో ఇక్కడ చెట్లు ఉన్నాయనే ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ చెట్లను తొలగించేందుకు యాజమాన్యం అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకోలేదు. ఈ విషయమై దిశ ప్రతినిధి కళాశాల ప్రిన్సిపాల్ రోజారాణిని వివరణ కోరగా, అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశామనీ, కాని ఇంకా అనుమతి రాలేదని, చెట్లను కొట్టలేదనీ, ప్రస్తుతం కొమ్మలు మాత్రమే నరికామని..అనుమతి రాగానే తొలగిస్తామని అన్నారు. హైదరాబాద్ జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లును కూడా వివరణ కోరగా, అనుమతి ఇచ్చినట్టుగా ఉందంటూ అస్పష్టంగా చెప్పడం గమనార్హం. అయితే, కోఠి ఉమెన్స్ కళాశాలలో చెట్లను నరికించిన విషయంపై అటవీ శాఖ అధికారులు పరిశీలించి కళాశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
tags : koti womens college , beheaded, hyderabad