శంషాబాద్‎లో వర్ష బీభత్సం

by Anukaran |
శంషాబాద్‎లో వర్ష బీభత్సం
X

దిశ, వెబ్‎డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‎లో వరద బీభత్సం సృష్టించింది. గగన్‎ పహాడ్ వద్ద వరద నీటిలో రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కార్లు, బైకులు కొట్టుకుపోయాయి. మరోవైపు అప్ప చెరువుకట్ట తెగి ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. వరదలో కొట్టుకుపోయిన వాహనాలను అధికారులు వెలికితీస్తున్నారు.

శంషాబాద్‌లోని కాముని చెరువు, గొల్లపల్లి చెరువులలో వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద నీరు హైదరాబాద్- బెంగుళూరు జాతీయ రహదారిపైకి వచ్చి చేరింది. దీంతో గగన్ పహాడ్ వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ పోర్టుకు వెళ్లేవారు పహాడీ షరీఫ్ నుంచి వెళ్లాలని అధికారులు సూచించారు.

Advertisement

Next Story