నగరంలో కుండపోత వర్షం

by Shyam |
నగరంలో కుండపోత వర్షం
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారు జామున 6.30 ప్రాంతంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. గత రెండ్రోజులగా వాతావరణం పొడిగా ఉండగా, ఈరోజు ఉదయం భారీ వర్షం నగరాన్ని ముంచెత్తింది. ముఖ్యంగా బోడుప్పల్, అంబర్ పేట, రామాంతపూర్, చిక్కడపల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్ పరిధిలో భారీ వర్షం నమోదైంది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.గ్రేటర్ పరిధిలోని కొన్ని చోట్ల డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నట్లు సమాచారం. రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ తక్షణ చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Next Story