- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పట్టణంలో భారీ వర్షం.. జలమయమైన లోతట్టు ప్రాంతాలు
X
దిశ, జమ్మికుంట: ఆదివారం రాత్రి జమ్మికుంట పట్టణంలో భారీ వర్షం కురిసింది. సుమారు నాలుగు గంటల పాటు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ జలమయం అయింది. కాలనీలోని పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది. ఇళ్లల్లోకి చేరిన వరద నీటితో కాలనీ వాసులు తంటాలు పడ్డారు. ఇళ్లల్లోకి చేరిన నీటిని బయటకు పంపించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో కూడా పలుమార్లు కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతమైన హౌసింగ్ బోర్డ్ కాలనీ నీట మునిగినప్పటికి, అధికార యంత్రాంగం శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. కాగా, విషయం తెలుసుకున్న తహశీల్దార్ తన సిబ్బందితో కాలనీలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
Advertisement
Next Story