ఏపీకి ఆరెంజ్ అలర్ట్.. 2 రోజులు భారీ వర్షాలు

by Anukaran |
ఏపీకి ఆరెంజ్ అలర్ట్.. 2 రోజులు భారీ వర్షాలు
X

దిశ, ఏపీ బ్యూరో : ఏపీలో మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం శాఖ తెలిపింది. దక్షణ కోస్తా, రాయలసీమలతో పాటు యానాం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గుంటూరు, అనంతపురం జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

అలాగే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే యానాంతో పాటు ఆంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓకేసారి అండమాన్ సమీపంలో ఏర్పడిన ఆవర్తనం అలాగే శ్రీలంక వద్ద ఏర్పడిన మరో అల్పపీడనం వల్ల రానున్న రెండు మూడు రోజుల్లో తమిళనాడుతో పాటు ఏపీ కోస్తా తీరం, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిచింది.

Advertisement

Next Story