- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్ : ఎక్సైజ్‌లో భారీగా ప్రమోషన్స్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పదోన్నతులకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 50 మందికి ప్రమోషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే 12 మంది పదోన్నతులు ఇచ్చి పోస్టింగ్‌లు కల్పించారు. ప్రస్తుతం 50 మందికి కూడా పదోన్నతులు ఇచ్చి పాత స్థానాల్లో యథావిధిగా పని చేయాలని ఆదేశాలిచ్చారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పదోన్నతులతో అదే స్థానాల్లో విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్రంలో ఆయా శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దానిలో భాగంగా కొద్ది రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ఫైల్‌కు మోక్షం లభించింది. పదోన్నతుల ఉత్తర్వులను సీఎస్ సోమేశ్‌కుమార్ బుధవారం జారీ చేశారు. ప్రస్తుతం అసిస్టెంట్ ఎక్సైజ్సూపరింటెండెంట్లుగా పని చేస్తున్న 24 మందికి ఎక్సైజ్ సూపరిటెండెంట్‌లుగా ప్రమోషన్ కల్పించారు. వీరితో పాటుగా 18 మంది ఎక్సైజ్ సూపరింటెండెంట్‌లకు అసిస్టెంట్ కమిషనర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. ఇక అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్లుగా పని చేస్తున్న ముగ్గురికి డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతి కల్పించారు. అంజన్‌రావు, హరికిషన్, ఏ శ్రీనివాస్‌రెడ్డికి డీసీగా ప్రమోషన్ వచ్చింది. వీరితో పాటుగా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లుగా పని చేస్తున్న నలుగురు మాధవ్, యాసీన్ ఖురేషీ, సురేష్, కేఏబీ శాస్త్రికి జాయింట్ కమిషనర్లుగా పదోన్నతి ఇచ్చారు. ఇక జాయింట్ కమిషనర్‌గా ఉన్న ఎన్.ఏ అజయ్ రావుకు అడిషనల్ కమిషనర్‌గా ప్రమోషన్ ఇచ్చారు.
ప్రభుత్వానికి టీజీవో ధన్యవాదాలు..
ఎక్సైజ్‌లో పదోన్నతులు కల్పించినందుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, తెలంగాణ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం తరుపున సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్‌కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీజీఓ ఆధ్వర్యంలో పదోన్నతుల కోసం ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తితో అవకాశం కల్పించారన్నారు. టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణతో పాటు టీజీఓ అబ్కారీ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్రావు, లక్ష్మణ్‌గౌడ్, టీజీఓ ప్రతినిధులు అరుణ్ కుమార్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు అండగా ప్రభుత్వం ఉంటుందని, త్వరలోనే అన్ని శాఖల్లో పదోన్నతులు వస్తాయని వారు పేర్కొన్నారు.