ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

by Sumithra |
ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 44 కిలోల మెథ్ డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్‌పోర్టులో బుధవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఎయిర్ కార్గోలో చెన్నె నుంచి ఖతార్‌కు వెళ్తున్న ఇద్దరు ప్రయాణికుల దగ్గర డ్రగ్స్ గుర్తించారు. ఇద్దరి నుంచి 44 కిలోల మెథ్ డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.5.1 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story