- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కౌకూర్ దర్గా సమీపంలో భారీగా గంజాయి పట్టివేత
దిశ, ఉప్పల్: గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విచ్చలవిడిగా కొనసాగిస్తోన్న గంజాయి విక్రయాలను అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నగర శివారు ప్రాంతంలోని కౌకూర్ ఎంబీ దర్గా సమీపంలో గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏకంగా 462 కిలోల గంజాయి ప్యాకెట్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల నుంచి గుట్టుగా గంజాయిని తక్కువ ధరకు తీసుకొచ్చి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎక్కువ ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నామని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ వివరాలను వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. కోటి 5 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. నిందితులైన ఆత్మకూరుకు చెందిన ఫరీద్ (25), జహీరాబాద్‌కు చెందిన ఇస్మాయిల్ (24), బీదర్ ప్రాంతానికి చెందిన సచిన్ (19), బస్వారాజ్ (22)లను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ నాయక్, ఎస్సైలు బాలకృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.