YCP MLA Bolla Brahma Naidu: వేడెక్కిన వినుకొండ రాజకీయాలు

by srinivas |   ( Updated:2021-05-27 22:36:07.0  )
YCP MLA Bolla Brahma Naidu: వేడెక్కిన వినుకొండ రాజకీయాలు
X

దిశ, వెబ్‌‌డెస్క్: గుంటుూరు జిల్లా వినుకొండలో ప్రమాణాల రాజకీయం హీటెక్కిస్తుంది. టీడీపీ నేత జీవీ స్వచ్ఛంద సంస్థకు ఎన్నారై ఫండ్స్ వస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. బొల్లా ఆరోపణలపై ఈ రోజు కోటప్పకొండపై ప్రమాణానికి సిద్ధమయ్యారు మాజీ ఎమ్మెల్యే జీవీ అంజనేయులు. అయితే ప్రమాణాలు వద్దు బ్యాలన్స్ షీట్‌తో వస్తే లెక్కలు తేల్చుకుందామని సవాల్ చేశారు బొల్లా బ్రహ్మనాయుడు. మరోవైపు 144 సెక్షన్ అమలులో ఉందని ఎక్కడికి వెళ్లదంటూ జీవీ అంజనయులుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం జీవీ ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. ఈ విషయంపై నర్సారవుపేట డీఎస్పీకి ఫిర్యాదు చేశారు జీవీ.

Advertisement

Next Story