- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిట్‌గా ఉన్నాము అనుకొని అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు: హరీష్ రావు
దిశ, శేరిలింగంపల్లి: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్‌లోని దుర్గంచెరువు వద్ద కార్డియాలజికల్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ వారు గుండెపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాదులపై అవగాహన కల్పించేందుకు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 శాతం మందికి బీపీ ఉందని, అలాగే 14 శాతం మందికి షుగర్ వ్యాధి ఉన్నట్లు ఇటీవల సర్వేలో వెల్లడయిందని, కానీ ఎవరికి వారు తాము ఫిట్, యంగ్ అనుకుంటూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సరైన పరీక్షలు చేయించుకోవడం లేదన్నారు. ఆకస్మిక మరణాలు, జిమ్ చేస్తూ, సరదాగా డ్యాన్స్ కుప్పకూలి చనిపోతున్న ఘటనలు చాలా చూస్తున్నామని గుర్తు చేశారు.
వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రధానంగా బీపీ, హార్ట్ టాక్ లాంటి జబ్బులకు సరైన చికిత్స తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యం ఉంటామని మంత్రి హరీష్ రావు సూచించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ కోసం విశేషంగా కృషి చేస్తున్నారని అందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనేక వైద్య పరీక్షలు ఉచితంగానే చేస్తున్నామని తెలిపారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియాలజికల్ సొసైటీ తెలంగాణ స్టేట్ చాప్టర్ వారు గుండెపోటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హోలిస్టిక్స్ హాస్పిటల్ వారు వాకర్స్‌కి అందుబాటులో ఉండేలాగా ఆటోమిటిక్ బీపీ మిషన్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు, డాక్టర్లు, వాకర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.