ఈ ఆకులతో ఊపిరితిత్తులకు తిరిగి ప్రాణం వస్తుంది..

by Sridhar Babu |   ( Updated:2023-07-04 14:15:00.0  )
ఈ ఆకులతో ఊపిరితిత్తులకు తిరిగి ప్రాణం వస్తుంది..
X

దిశ, వెబ్​డెస్క్​ : వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే ఎన్నో శ్వాస సంబంధ వ్యాధులు మనల్ని వేధిస్తుంటాయి. వీటిలో ఊపిరితిత్తుల‌ ఇన్ఫెక్ష‌న్స్, ఆస్థ‌మా, న్యుమోనియా, ద‌గ్గు, బ్రాంకైటిస్ ప్రధానమైనవి. ఈ వ్యాధులు ఉన్న వాళ్లు చల్లని నీళ్లు తాగినా, చల్లని వాతావరణంలో తిరిగినా ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. క‌నుక ఊపిరితిత్తుల‌ను మ‌నం ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కానీ ప్ర‌స్తుత కాలంలో తీవ్రమైన కాలుష్యం కారణంగా ఇది సాధ్యం కావడం లేదు. కార్బన్​పదార్థాలు ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి అనేక రోగాలకు కారణమవుతున్నాయి. పైగా ఈ స‌మ‌స్య‌ల‌కు మందులు వాడ‌డం వ‌ల్ల మ‌నం అనేక దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంటుంది. ఇలా ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు స‌హ‌జ సిద్దంగా ల‌భించే వామాకును వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

వాము చెట్టు మందటి ఆకులతో ప్రతి నర్సరీలో కూడా లభిస్తుంది. ఆకు పచ్చని రంగులో ఉన్న ఈ ఆకులను ముట్టుకుంటే వామ వాసన వెదజల్లుతుంది. దీనిని నేరుగా కూడా తినొచ్చు. వామాకులో థైమాల్, కార్వ‌కాన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల్లో శ్లేష్మాలు ఎక్కువ‌గా త‌యార‌వ్వ‌డానికి కార‌ణ‌మ‌య్యే హిస్ట‌మిన్స్ ఉత్ప‌త్తిని త‌గ్గించ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అంతేకాకుండా వామాకును వాడ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్ష‌న్ ల కార‌ణంగా త‌లెత్తే ఇబ్బంది, చికాకు త‌గ్గుతుంది. ఆస్థ‌మా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వామాకును వాడ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య నుండి చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంద‌ని ప‌రిశోధ‌న‌ల ద్వారా తేలింది. ఆస్థ‌మా స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారికి ఇది చక్కగా దోహదపడుతుంది. ఇండ్ల‌ల్లో ఈ వామాకు మొక్క త‌ప్ప‌కుండా ఉండాలి. వామాకును ప‌చ్చడిగా చేసి తీసుకుంటే ఎంతో ఉపయోగం కలుగుతుంది. అలాగే నీటిలో వామాకును వేసి మ‌రిగించి ఆ నీటిని తాగ‌వ‌చ్చు. వంట‌ల్లో కూడా వామాకును వాడుకుకోవ‌చ్చు. ఏదో ఒక రూపంలో రోజూ గుప్పెడు వామాకును ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్యలు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతో పాటు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Read More..

దివ్య ఔషధంగా పుదీనా.. ఒకటా, రెండా.. ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Advertisement

Next Story