సీజన్ కదా అని అతిగా మామిడిపండ్లు తింటున్నారా.. జాగ్రత్త

by samatah |   ( Updated:2023-04-14 07:01:27.0  )
సీజన్ కదా అని అతిగా మామిడిపండ్లు తింటున్నారా.. జాగ్రత్త
X

దిశ, వెబ్‌డెస్క్ : వేసవి వచ్చిందంటే చాలు. అందరికీ నూరూరించే మామిడికాయలే గుర్తు వస్తాయి. ఇక మామిడికాయలను ఇష్టపడని వారు అస్సలే ఉండరు. చిన్ని పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా మామిడికాయలను తింటుంటారు.

అయితే ఇక సీజన్ కధా, మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయని, అతిగా తినకూడదంట. ఎండకాలంలో మామిడి పండ్లు అతిగా తినడం వలన అనేక అనారోగ్య సమస్యల భారిన పడే అవకాశం ఉందంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • మామిడి పడ్లు కొన్ని తియ్యగా, మరికొన్ని పుల్లగా ఉంటాయి. అందువలన మదుమేహం, షుగర్ వ్యాధి ఉన్నవారు మామిడికాయలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించాలంట.
  • వేసవిలో మామిడిపండ్లను అతిగా తినడం వలన డయేరియా వచ్చే అవకాశం ఉంటుందంట. అందువలన అతిగా తీసుకోకూడదంటున్నారు వైద్యులు.
  • మామిడి పండ్లు అతిగా తినడం వలన ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఎదురవుతాయంట.
Advertisement

Next Story