ప్రెగ్నెంట్ సమయంలో టెన్షన్ పడుతున్నారా.. పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావం?

by GSrikanth |   ( Updated:2022-09-07 14:58:54.0  )
ప్రెగ్నెంట్ సమయంలో టెన్షన్ పడుతున్నారా.. పుట్టబోయే బిడ్డపై తీవ్ర ప్రభావం?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రెగ్మెంట్​సమయంలో మీరు టెన్షన్​పడుతున్నారా? చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ఆలోచించి ఒత్తిడికి గురవుతున్నారా? అయితే, ఇది లాంగ్​ టైంలో హెల్త్ ప్రాబ్లమ్స్‌ను తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. తల్లితో పాటు పుట్టబోయే బిడ్డపై కూడా ఆరోగ్య సమస్యలు ప్రభావం చూపనున్నాయి. కొవిడ్ తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువైందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రెస్‌కు గురవుతున్న గర్భిణుల సంఖ్య పెరుగుతున్నది. దేశ వ్యాప్తంగా మన స్టేట్‌లోనే ఎక్కువ మంది బాధితులు ఉన్నట్లు ఇటీవల నేషనల్​ఫ్యామిలీ హెల్త్​సర్వే – 5లో కూడా పొందుపరిచారు. తల్లి మానసిక సమస్యతో బాధపడుతుంటే పుట్టబోయే బిడ్డకు నష్టం కలిగే అవకాశం ఉన్నది. మానసిక సమస్యతో ఇబ్బంది పడుతున్నోళ్లు ఫస్ట్ డెలివరీలో అవస్థలు ఎదుర్కొవాల్సి వస్తున్నది. కాన్ఫు సమయంలో బీపీ డౌన్​కావడం, నార్మల్ డెలివరీలకు సహకరించకపోవడం వంటివి జరుగుతున్నాయి. మరోవైపు మెంటల్ టెన్షన్లు పడుతూ తల్లి సరైన పౌష్టికాహారం తీసుకోనందున పుట్టబోయే బిడ్డ బరువు, ఎత్తు లోపిస్తూ పుట్టే ఛాన్స్ ఉన్నది. అంతేగాక బుద్ది మాంధ్యం కూడా వచ్చే ఆస్కారం ఉన్నదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గర్భిణీ స్త్రీలు నిత్యం ఆరోగ్యంగా ఉండేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించింది. మెంటల్ టెన్షన్లు పెరుగుతున్న దేశాలు, రాష్ట్రాలు ప్రత్యేక కార్యచరణతో ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉన్నదని డబ్ల్యూహెచ్ ఓ నొక్కి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గర్భిణుల్లో మానసిక సమస్యలు తగ్గించేందుకు అప్రమత్తమైంది.

జిల్లాకో మెంటల్, హెల్త్ సెంటర్

రాష్ట్రంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న గర్భిణులు, చిన్నారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో జిల్లాకో మెంటల్, హెల్త్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్‌లో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్ని కొత్త జిల్లాల్లో 33 మెంటల్ అండ్​హెల్త్​కేర్​సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి కేవలం ప్రెగ్మెంట్​ఉమెన్, చిల్డ్రన్స్‌కు మాత్రమే ఎక్స్​క్లూజీవ్‌గా సేవలు అందించనున్నాయి. ప్రతీ కేంద్రంలో ఓ సీనియర్​సైక్రియాసిస్ట్, గైనకాలజిస్ట్, ఓ అసిస్టెంట్ డాక్టర్, ఇద్దరు స్టాఫ్​నర్సులు, ఇతర సపోర్టు సిబ్బంది ఉండనున్నారు. మానసిక సమస్యలతో వచ్చే గర్భిణులకు ఇక్కడ కౌన్సిలింగ్​ఇవ్వనున్నారు. పేషెంట్ కండీషన్​బట్టి ఈ కేంద్రంలో అడ్మిషన్ ఇవ్వనున్నారు. ప్రతీ రోజు డాక్టర్ల టీమ్​పర్యవేక్షలో కౌన్సిలింగ్​ఇవ్వనున్నారు. అబార్షన్లు కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మందులతో పాటు ధ్యానం లాంటివి చేయించనున్నారు. డెలివరీ అయ్యే వరకు ఈ సెంటర్ల టీమ్​పేషెంట్‌ను ఫాలప్ చేయనున్నది. అంతేగాక డెలివరీ తర్వాత కూడా పేషెంట్ మానసిక పరిస్థితి ఎలా ఉన్నది? అనే వివరాలను కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేసుకుంటూ పేషెంట్లకు వైద్యంతో పాటు కౌన్సిలింగ్​ఇస్తారు. పిల్లలు పుట్టిన ఏడాది పాటు సదరు పేషెంట్‌ను అబ్జర్వేషన్​చేస్తూనే ఉంటారు. ఇక చిన్నపిల్లల్లోనూ మెంటల్​టెన్షన్లు అదే స్థాయిలో ఉన్నాయి. ఈ కేటగిరీ సెన్సెంటీవ్​ఏజ్​గ్రూప్ కావడంతో ఆట పాటలతో పాటు కౌన్సిలింగ్​ఇవ్వనున్నారు. వీళ్లకు మెడిసిన్స్ కంటే ఫిజికల్​యాక్టివిటీస్‌తోనే మానసిక సమస్యలు తగ్గించేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తారు. ఈ కేంద్రాల్లో ఫిజికల్​కౌన్సిలింగ్‌తో పాటు ఆన్‌లైన్‌లోనూ ట్రీట్మెంట్​ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మెంటల్ హెల్త్​క్యూర్ సర్వీస్​ఉన్నప్పటికీ, ఇవి కేవలం టెలీ మెడిసిన్​రూపంలో ఉన్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతే స్కీమ్‌లో ఆన్‌లైన్‌తో పాటు ఫిజికల్​చికిత్స కూడా డాక్టర్లు చేస్తారు.

ఆన్‌లైన్ ట్రీట్మెంట్‌కు ప్రత్యేక సాప్ట్‌వేర్

మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, చిన్నారుల ఆన్​లైన్​చికిత్స కోసం ప్రభుత్వం స్పెషల్ సాప్ట్​వేర్ వ్యవస్థను రూపొందిస్తున్నది. అన్ని జిల్లాలకు అనుసంధానంగా కోఠి ఫ్యామిలీ వెల్ఫేర్​డిపార్ట్​మెంట్‌లో కమాండ్​కంట్రోల్​సిస్టం ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక ఐటీ టీమ్​ఈ కార్యక్రమాన్నీ అంతా మానిటరింగ్ చేస్తుంది. డాక్టర్లు, పేషెంట్లను అనుసంధానిస్తూ ట్రీట్మెంట్​సజావుగా జరిగేలా చొరవ తీసుకుంటారు. ఇప్పటికే ఆన్​లైన్​వ్యవస్థ కోసం పరికరాలు, ఎక్విప్‌మెంట్లు, ఇతర వస్తువులన్నీ ఆర్టర్ పెట్టినట్లు ఓ అధికారి తెలిపారు. ఇక స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లు, హాస్టళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేందుకు మొబైల్​వ్యాన్లు సౌకర్యం కూడా ఉండనున్నది. ఈ టీమ్‌లు ప్రతీ మండల కేంద్రంలో నెలకో క్యాంపు పెట్టేలా ప్లాన్​చేయనున్నారు. అతి త్వరలో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ కృషి చేస్తున్నది.

సెక్సీ సోనాలి.. ఇన్నర్‌వేర్‌లో యోగా ఫీట్.. తప్పని ట్రోల్స్

Advertisement

Next Story

Most Viewed