అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించేందుకు సింపుల్ టిప్స్..

by Sumithra |
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించేందుకు సింపుల్ టిప్స్..
X

దిశ, ఫీచర్స్ : బాదంపప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతే కాదు బాదం పప్పుతో అందాన్ని కూడా పెంచుకోవచ్చంటున్నారు. వాటితో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయాన్ని నానబెట్టిన బాదంను తింటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందట. బాదంలో ఒమేగా 3, కాల్షియం అధికంగా ఉంటుంది. అంతేకాదు మెగ్నీషియం, ఫైబర్, రిబోఫ్లావిన్, ప్రోటీన్, విటమిన్ ఇ లాంటి ఎన్నో పోషకాలు కూడా బాదంలో ఉన్నాయి. వీటిని తినడం వలన చర్మం, జుట్టు, గుండె, మెదడు, ఎముకలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో మనం తినే ఆహారపదార్థాలు ఎలా కల్తీ వస్తున్నాయో ఇప్పుడు బాదం కూడా కల్తీ వస్తుంది. మరి నకిలీ బాదంను ఎలా కనుక్కోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదంను రుద్ది తేడా గుర్తించవచ్చు..

మార్కెట్లో బాదం కొనుగోలు చేసినప్పుడు ముందుగా దాని రంగును పరిశీలించండి. ముదురు రంగులో బాదం కనిపిస్తే దాన్ని టిష్యూ పేపర్‌తో రుద్దాలి. అలా చేసినప్పుడు రంగు కోల్పోతే అది నకిలీ బాదంపప్పుగా గుర్తించవచ్చు.

నిజమైన బాదం..

బాదం తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో దాని నూనెతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సంరక్షణకు, వెంట్రుకల పెరుగుదలకు బాదం నూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న బాదం పప్పు నకిలీదా, అసలుదా తెలుసుకోవడానికి ముందుగా దాన్ని పగలగొట్టి చేతితో నలగగొట్టి పరీక్షించాలి. అని నకిలీదైతే చేతులకు నూనె అంటుకోదు, నిజమైనదైతే చేతులకు నూనె అంటుకుంటుంది.

రుచితో గుర్తింపు..

బాదంపప్పులు కొనేముందు వాటి రుచి చూడడం చాలాముఖ్యం. రుచిద్వారా కూడా నకిలీదా, నిజమైనదా తెలుసుకోవచ్చు.

నీటిలో నానబెట్టిన తర్వాత ఆకృతి..

ముందుగా బాదంపప్పును నీటిలో నానబెట్టి గిన్నెలో నుంచి తీయాలి. నానబెట్టిన నీళ్ల రంగు మారిందా లేదో చూడాలి. ఒకవేళ్ల నీళ్లు రంగుమారితే వాటి పై సింథటిక్ రంగులు ఉపయోగించినట్లు తెలుసుకోవచ్చు. అలాగే నిజమైన బాదం పప్పులు నానబెట్టినప్పుడు చాలా బాగా ఉబ్బుతుంది.

Advertisement

Next Story