- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ కళ్ళలో మార్పు గమనిస్తున్నారా .. గుండెనొప్పికి సంకేతాలు కావొచ్చు..
దిశ, ఫీచర్స్ : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా గుండెపోటు మరణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలివారి వరకు గుండెపోటుకు బలవుతున్నారు. ఒక మనిషిని హార్ట్ ఎటాక్ ఎప్పుడు, ఎక్కడ కబలిస్తుందో ఎవరికీ తెలియదు. పొగత్రాగడం, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, వంశానుగతంగా వచ్చే జన్యువులు, వ్యాయామ లోపం, మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి. అయితే గుండెపోటు రావడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని మనం గుర్తిస్తే గుండెపోటు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
గుండెకు రక్త ప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉన్నపుడు ఆ వ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెనొప్పి, గుండె పట్టినట్లు ఉంటుంది. అలాగే అప్పుడప్పుడూ ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంతో కాస్త ఇబ్బంది ఉంటే గుండెపోటు లక్షణంగా పరిగణిస్తారు. కానీ ఇవి కాకుండా కళ్లలో కూడా కొన్ని మార్పులు, సంకేతాలు కనిపిస్తాయట. మరి ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్లలో వాపు
గుండెపోటు రావడానికి ముందు కళ్ల చుట్టూ అకస్మాత్తుగా వాపువచ్చినట్టుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్య ఏర్పడితే కళ్ల చుట్టూ నీరు చేరి ఉబ్బి ఉండవచ్చంటున్నారు. అలా జరిగినప్పుడు వెంటనే వైద్యులని సంప్రదించడం మంచిదంటున్నారు.
కంటి రంగులో మార్పు
మీ కంటి రంగు ఎరుపు, పసుపులో మారితే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కళ్లలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉండకపోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
సరిగ్గా చూడలేకపోవడం..
గుండె సంబంధిత సమస్య ఏర్పడినప్పుడు కళ్లకు రక్తప్రసరణ సరిగ్గా ఉండదు. దీంతో వస్తువలు అస్పష్టంగా కనిపిస్తాయని నిపుణుల అభిప్రాయం. ఇలాంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
కనురెప్పలు పడిపోవడం..
కనురెప్పలు వాలుతూ ఉంటే అది గుండెపోటుకు సంకేతం అంటున్నారు వైద్య నిపుణులు. కనురెప్పల సమీపంలో ఉండే కండరాలకు రక్త ప్రసరణ తగ్గి కండరాలు బలహీనపడి రెప్పలు వాలిపోతూ ఉంటాయి.