- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిక వేడి చర్మాన్ని దెబ్బతీస్తుందా.. ఈ నివారణ పద్ధతులను తెలుసుకోండి..
దిశ, ఫీచర్స్ : ఏప్రిల్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్రమైన వేడితో కుతకుతలాడతాయి. వేడి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటారు. విపరీతమైన వేడి చర్మం పై కూడా ప్రభావం చూపుతుంది. దీని వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డెర్మటాలజిస్ట్ లు ఎలాంటి సూచనలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏప్రిల్ నెలలో వచ్చే ఎండల కారణంగా వేడి స్ట్రోక్‌తో పాటు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత మీ చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ సీజన్‌లో స్కిన్ ఇన్‌ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది. చర్మంపై ఎర్రటి దద్దుర్లు, దురద, మంట, చర్మం నల్లబడటం వంటి సమస్యలను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు చర్మ రక్షణ అవసరం.
చెమట గ్రంథులు అడ్డుకోవడం వల్ల ఇలా చర్మ సమస్యలు వస్తున్నాయంటున్నారు డెర్మటాలజిస్టులు. వేసవి కాలంలో అధిక సూర్యకాంతి, దుమ్ము, అలర్జీల వల్ల చర్మ వ్యాధులు వస్తాయి. ఈ సీజన్‌లో కొంతమందికి శరీరం పై ఎర్రటి దద్దుర్లు సమస్య కూడా పెరుగుతుంది. ఈ దద్దుర్లు ఎక్కువగా వెనుక భాగంలో కనిపిస్తాయి. ముఖం, చేతుల పై కూడా కనిపిస్తాయి. ఎవరైనా అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అయితే సొంత వైద్యం చేసుకోవడం వలన చర్మం దెబ్బతింటుందని చెబుతున్నారు.
వడదెబ్బ సమస్య..
విపరీతమైన వేడిలో ఎక్కువ సేపు ఉండడం వల్ల కూడా వడదెబ్బ తగులుతుంది. దీని కారణంగా చర్మం దెబ్బతింటుంది. శరీరం పై దద్దుర్లు కనిపించవచ్చు. అందుకే ఈ సీజన్‌లో సూర్యకాంతి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడం చాలా ముఖ్యం. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు మీ ముఖాన్ని, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచుకోవాలి. బయటకు వెళ్లడానికి 15 నిమిషాల ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేసుకోవాలి. 30 కంటే ఎక్కువ SPF ఉన్న సన్‌స్క్రీన్‌ని వాడడం మంచిదంటున్నారు నిపుణులు.
మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానుకోండి. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉన్నట్టయితే, బయటకు వెళ్లిన తర్వాత కూడా నీరు త్రాగుతూ ఉండాలి. ఈ సమయంలో సీజనల్ పండ్లను తినడం మంచిది. నీరు ఉన్న పండ్లు, విటమిన్ సి ఉన్న పండ్లను కూడా తినాలి. నారింజ, పుచ్చకాయ ఎక్కువగా తీసుకోవాలి.
ఈ విషయాలను గుర్తుంచుకోండి..
ఈ సీజన్‌లో చర్మం పై ఏదైనా మచ్చలు ఏర్పడినా లేదా అకస్మాత్తుగా వెనుక భాగంలో దద్దుర్లు కనిపించడం ప్రారంభిస్తే, అది ఏదో సమస్యకు సంకేతం. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో చికిత్స చేస్తే చర్మవ్యాధులు తీవ్రం కాకుండా నివారించవచ్చు.