జుట్టుకు నూనె రాసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

by samatah |   ( Updated:2023-04-29 06:56:37.0  )
జుట్టుకు నూనె రాసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్ : ఎండ వేడి, మంచు, దుమ్ము, కలుషిత పొగలు వంటి కారణాల వల్ల ఎండిపోయే జుట్టును హైడ్రేట్ చేసే టానిక్ నూనె. అందువలన తలకు ఆయిల్ అనేది ప్రతీ ఒక్కరూ రాస్తుంటారు. అయితే కొందరు వారానికి ఒకసారి రాస్తే మరికొందరు ప్రతీ రోజు జుట్టుకు ఆయిల్ అనేది పెడుతుంటారు. ఇలా జుట్టుకు నూనె రాసుకోవడం వలన కుదుల్లు ఆరోగ్యకరంగా ఉండటమే కాకుండా, జుట్టు రాలకుండా, తలనొప్పిని కూడా నివారిస్తుంది.

అయితే కొందరు జుట్టుకు నూనె రాసేముందు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వలన మీ జుట్టు, తలకు హానీ చేసే అవకాశం ఉంది. అందువలన జుట్టుకు నూనె రాసుకునే సమయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం.

1. తల కడుక్కోవడానికి 2-3 గంటల ముందు నూనె రాయండి. అలాగే జుట్టు బాగా మురికిగా ఉంటే రాత్రిపూట నూనె రాసి ఉదయాన్నే షాంపూతో కడిగేయాలి. దీని వలన జుట్టు రాలకుండా, నీటుగా ఉంటుంది.

2. తలకు నూనె రాసుకునే ముందు ఆయిల్‌ను కొంత వేడి చేసి తలకు మర్దన చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయంట.

3. మసాజ్ చేసేటప్పుడు, అధిక ఒత్తిడిని ఉపయోగించవద్దు. ఎందుకంటే ఇది జుట్టు మూలాలను దెబ్బతీస్తుంది. జుట్టు రాలడానికి దారితీస్తుంది.

4. అధికంగా మురికిగా ఉంటే నూనెను జుట్టుకు పెట్టకూడదు. దీని వలన జుట్టు క్షీణిస్తుంది.

Also Read..

కొందరు ఎడమ చేతితో ఎందుకు రాస్తారు?

Advertisement

Next Story