తక్కువ మద్యం ఆరోగ్యానికి ప్రమాదమా.. ప్రయోజనమా..

by Sumithra |
తక్కువ మద్యం ఆరోగ్యానికి ప్రమాదమా.. ప్రయోజనమా..
X

దిశ, ఫీచర్స్ : కొంతమంది ప్రతిరోజు ఒక లిమిట్ లో ఆల్కహాల్ ను తీసుకుంటూ ఉంటారు. అలా కొద్దికొద్దిగా తాగడం వల్ల ఎటువంటి హాని జరగదని నమ్ముతారు. అయితే ఇది నిజమేనా? 'షార్ట్ పెగ్స్' తాగడం నిజంగా సురక్షితమేనా ? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు 12 ఏళ్లపాటు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో మితంగా మద్యం సేవించడంలో అనేక ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. ఆల్కహాల్ తక్కువ మోతాదులో ఉన్నా, మీ ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ పరిశోధన వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ పరిశోధన ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రిటన్‌లో 60 ఏళ్లు పైబడిన వారిలో క్యాన్సర్ మరణాలు పెరగడానికి తక్కువ ఆల్కహాల్ తీసుకోవడం కూడా కారణమని పరిశోధకులు ఒక అధ్యయనంలో తెలిపారు.

1 లక్ష కంటే ఎక్కువ మంది పై అధ్యయనం..

60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 1,35,103 మంది పెద్దలను 12 సంవత్సరాల పాటు పర్యవేక్షించిన ఈ అధ్యయనం, మితంగా మద్యం సేవించడం గుండెకు మంచిదనే దీర్ఘకాల నమ్మకాన్ని కూడా తోసిపుచ్చింది.

తక్కువ మద్యం తాగడం ఎలా ?

యూనివర్సిడాడ్ ఆటోనోమా డి మాడ్రిడ్‌లో ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ అసిస్టెంట్ ప్రొఫెసర్, పేపర్ ప్రధాన రచయిత డాక్టర్ రోసారియో ఓర్టోలా ఈ విషయమై మాట్లాడుతూ మితమైన మద్యపానం, మరణాల మధ్య సానుకూల సంబంధం ఉన్నట్లు తాము ఎటువంటి ఆధారాలు కనుగొనలేదన్నారు. ఈ అధ్యయనం JAMA నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించారు. మరోవైపు, ఆల్కహాల్ 'మొదటి డ్రాప్ నుండి' క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనం వెల్లడించింది.

తక్కువ మద్యం సేవించడం వల్ల ప్రమాదమా లేదా ప్రయోజనమా..

ఆల్కహాల్ పరిశోధనలో కొలతలు మారుతున్నాయనడానికి పెరుగుతున్న సాక్ష్యాలలో ఈ ఫలితాలు ఒకటి. ఆల్కహాల్ తాగడం వల్ల కలిగే నష్టాలు, ప్రయోజనాలను విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే ఆల్కహాల్ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని గతంలో చేసిన పరిశోధనలు తీవ్రంగా లోపభూయిష్టంగా ఉన్నాయని కొందరు నమ్ముతున్నారు.

ఈ పరిశోధన చాలా వరకు మద్యపానానికి దూరంగా ఉండేవారిలో కాకుండా తక్కువ లేదా అప్పుడప్పుడు తాగేవారిలో గుండె జబ్బులు, మరణాల రేటును పోల్చింది. మద్యపానం చేయనివారిలో చాలా మంది వ్యక్తులు అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నందున మద్యపానం మానేశారు.

మద్యపాన మరణాలు..

ప్రస్తుత US ఆహార మార్గదర్శకాలు 'ఎక్కువగా తాగడం కంటే తక్కువ తాగడం ఆరోగ్యానికి మేలు' అని పేర్కొంటున్నాయి. 21 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలు మద్యం సేవించే రోజు ఒక డ్రింక్ తీసుకోవాలని, పురుషులు రెండు పెగ్గుల పరిమితిలో ఉండాలని సిఫార్సు చేస్తున్నారు.

నార్త్ వెస్ట్ మల్టీ-సెంటర్ రీసెర్చ్ ఎథిక్స్ కమిటీ ఆమోదించిందిన అధ్యయనం ప్రకారం తక్కువ ఆల్కహాల్ తాగే వృద్ధులకు ఆరోగ్య సంబంధిత లేదా సామాజిక ఆర్థిక ప్రమాదాల కారణంగా మరణించే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది.

క్యాన్సర్ ప్రమాదం..

మితమైన మద్యపానం అంటే పురుషులు రోజుకు 20 నుండి 40 గ్రాములు, స్త్రీలు 10 నుండి 20 గ్రాముల మధ్య మద్యపానం తాగవచ్చని అధ్యయనం నిర్వచించింది. అదే అతిగా మద్యపానం అంటే పురుషులు రోజుకు 40 గ్రాముల కంటే ఎక్కువ, స్త్రీలు రోజుకు 20 గ్రాముల కంటే ఎక్కువ మద్యపానం తీసుకోవడం కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర అనారోగ్య కారణాల వల్ల మరణాల ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు పరిశోధకులు.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story