- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోషన్‌లో బ్లడ్ పడుతోందా.. కారణం క్యాన్సరేమో!
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటారు వైద్యులు. మనం తీసుకుంటున్న ఆహారం, జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. మరీ ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాపకింద నీరులా విస్తరిస్తోంది. అయితే కొంత మందికి క్యాన్సర్ లక్షణాలు ప్రాథమిక దశలోనే కనిపిస్తాయి. కానీ అది క్యాన్సర్ అని గుర్తించకుండా, లైట్ తీసుకుంటారు. చివరకు ఇది ప్రాణాల వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక కొంత మందికి మలంలో రక్తం పడుతుంది. దీంతో వారు ఫిషర్ లేక అర్షమొలలు అని లైట్ తీసుకుంటారు. కానీ ఇది క్యాన్సర్ కూడా కావచ్చు అంటున్నారు నిపుణులు. మలద్వారం ద్వారా ఎలాంటి పెయిన్ లేకుండా బ్లడ్ పడితే, కాస్త ఆలోచించాలంట. ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లైతే? వారు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంట. ఎందుకంటే, ఇది కోలన్ లేదా రెక్టల్ క్యాన్సర్‌కు కారణం కావొచ్చునంటున్నారు వైద్యులు. పెద్ద పేగులో కణతి ఉన్న సమయంలో కూడా ఎలాంటి పెయిన్ లేకుండా మోషన్‌లో బ్లడ్ పడుతుందంట. అందువలన ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ఒకసారి వైద్యుడిని కలిసి, తగు పరీక్షలు చేయించుకోవాలంట.