- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కంటి నిండా నిద్ర పట్టాలంటే తప్పకుండా ఇలా చేయాల్సిందేనంట!
దిశ, ఫీచర్స్ : నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన నిపుణులు ఒక వ్యక్తి కనీసం 6 లేదా 7 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలని చెప్తుంటారు. కానీ కొంత మందికి అస్సలే నిద్రపట్టదు. ఒత్తిడి, మానసిక సమస్యల వలన నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అయితే కంటినిండా నిద్ర పోవాలి అంటే అందుకు తగిన శారీరక శ్రమ అవసరం అంటున్నారు పరిశోధకులు.
శారీరక శ్రమ, నిద్ర నాణ్యత, మానసిక ఉల్లాసం మధ్య బలమైన లింక్ ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధనా బృందం తాజాగా నిద్రకు సంబంధించిన ఓ స్టడీ నిర్వహించింది. 82 మందిని ఏర్పాటు చేసి ట్రాకర్స్ ద్వారా నిద్రపోయే విధానాన్ని ట్రాక్ చేసింది. నిద్రలో హృదయ స్పందన రేటు, నిద్రలోని దశలును పరిశోధకులు రికార్డు చేశారు. శారీరక శ్రమ అనేది నిద్ర, మానసిక స్థితిని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై కీలక డేటాను సేకరించారు. అయితే ఒత్తిడితో బాధపడే వారు సరిగ్గా నిద్రించడం లేదని, కానీ శారీరక శ్రమ చేసిన వారు మాత్రం చక్కగా నిద్రపోతున్నట్లు వారు వెల్లడించారు. అంతే కాకుండా ఇలా నిద్రపోయిన వారిలో మానసిక ఒత్తిడి కూడా తగ్గినట్లు వారు పేర్కొన్నారు. అందువలన కంటినిండా నిద్రపోవాలంటే తప్పనిసరిగా శారీరక శ్రమ చేయాలంటున్నారు వారు.