ప్రతిరోజూ చికెన్ తింటే ఈ రోగాలు రావడం ఖాయం..

by Kalyani |   ( Updated:2023-07-01 13:45:59.0  )
ప్రతిరోజూ చికెన్ తింటే ఈ రోగాలు రావడం ఖాయం..
X

దిశ, వెబ్ డెస్క్: మీకు చికెన్ తినడం ఇష్టమా.. ప్రతి రోజూ చికెన్ రక రకాలుగా వండుకొని తింటున్నారా.. అయితే మీరు రోగాలు కొని తెచ్చుకున్నట్లే. ఎందుకంటే ప్రతి రోజు చికెన్ తింటే వివిధ రకాల రోగాలకు గురై ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కోళ్లఫారంలో పెరిగే కోళ్లు వివిధ కెమికల్ మందులతో బరువు త్వరగా పెరుగుతాయి. అలా పెరిగిన కోళ్ల చికెన్ తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయి.

చికెన్ తింటే హృదయానికి సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా బాగా బరువు పెరుగుతారు. కీళ్ల నొప్పులు వస్తాయి. శరీంలో వేడిమి ఎక్కువై ముక్కు నుంచి రక్తం కారడం, ముఖంపై మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. అందుకే ప్రతిరోజూ చికెన్ తినేవారు వారానికి ఒకసారి తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Read more: మునగతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..

భోజనం చేసిన వెంటనే వీటిని తింటున్నారా?

Advertisement

Next Story