ఈ సమస్యలు ఉన్న వారు కాకరకాయ తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

by samatah |
ఈ సమస్యలు ఉన్న వారు కాకరకాయ తింటే ఎంత ప్రమాదమో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : కూరగాయల్లో కాకరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు. ఇది చేదు ఉంటుంది కానీ దీని వలన అనేక రోగాలు పరార్ అవుతాయి. కానీ చేదు కారణంగా కాకరకాయ తినడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపరు. డైయాబెటీస్ పేషెంట్స్‌కి కాకరకాయ చాల మంచిది. కానీ కాకరకాయ తినడం వలన కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నదంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నప్పుడు అస్సలే కాకరకాయ తినకూడదంట. ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిదికాదంట.

  • గర్భిణీలు కాకరకాయ అస్సలే తినకూడదంట. అందులో ఉండే మేమోచ్రిన్ పుట్టుబోయే బిడ్డకు హాని తలపెడుతుందంట. అందువలన కాకరకాయకు గర్భిణీలు చాలా దూరంగా ఉండాలంటున్నారు వైద్యులు.

  • అలాగే కొందరు ఎక్కువగా కాకరకాయర రసం తాగుతుంటారు. అయితే ఇది ఎక్కువగా తాగడం వలన కాలేయం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉన్నదంట.

Advertisement

Next Story