GST On Insurance: రూ.5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

by Maddikunta Saikiran |
GST On Insurance: రూ.5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ సిటిజన్ల(Senior citizens) కోసం తీసుకునే ఆరోగ్య బీమా ప్రీమియంపై(Health Insurance Premium), జీవిత బీమా ప్రీమియంపై(Life Insurance Premium) వస్తు, సేవల పన్ను(GST) నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉందని సమాచారం. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ విధించే అంశంపై మంత్రివర్గ ఉపసంఘం(Cabinet Subcommittee) శనివారం భేటీ అయ్యింది. ఈ భేటీలో రూ.5 లక్షల వరకు తీసుకునే లైఫ్‌ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై జీఎస్​టీ రద్దు చేయాలనీ నిర్ణయించారు. అలాగే సీనియర్ సిటిజన్ల కోసం తీసుకునే హెల్త్‌ ఇన్సూరెన్స్‌లపై కవరేజితో సంబంధం లేకుండా జీఎస్​టీ నుంచి మినహాయించాలని తీర్మానించారు. ఈ విషయంలో మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్లు బీహార్ డిప్యూటీ సీఎం(Bihar Dy.CM) సామ్రాట్ చౌధరి(Samrat Chaudhary) తెలిపారు.

కాగా ప్రస్తుతం ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని వసూలు చేస్తున్నారు. అయితే దీన్ని తొలగించాలని గతకొన్ని నెలలుగా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల జీఎస్​టీ కౌన్సిల్‌ సమావేశమైంది. ఈ సమావేశంలో ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంలపై పన్నును నిర్ణయించేందుకు 13 మంది సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్‌గా సామ్రాట్ చౌదరిని నియమించారు. ఇందులో యూపీ, రాజస్థాన్‌, బంగాల్‌, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్‌, మేఘాలయ, పంజాబ్‌, తమిళనాడు, తెలంగాణ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ అక్టోబర్‌ నెలాఖరులోగా తన నివేదికను జీఎస్​టీ కౌన్సిల్‌కు సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed