- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేసవిలో పిల్లలకు డ్రై ఫ్రూట్స్ తినిపించాలనుకుంటున్నారా.. ఏది బెటరో చూడండి..
దిశ, ఫీచర్స్ : డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. దీంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. వీటిని ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి తగిన మోతాదులో ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఫైబర్, మినరల్స్ అందుతాయి. అయితే చాలామంది వేసవి కాలంలో వీటిని తినడానికి దూరంగా ఉంటారు.
డ్రై ఫ్రూట్స్ శరీరానికి వేడికలిగిస్తుంది. అందుకే పిల్లలు కూడా డ్రై ఫ్రూట్స్ తినకూడదని పెద్దలు చెబుతారు. చాలా మంది తమ పిల్లలను చలికాలంలో మాత్రమే డ్రై ఫ్రూట్స్ తినడానికి అనుమతిస్తారు. ఎందుకంటే వాటి స్వభావం వేడిగా ఉంటుందని నమ్ముతారు. వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. వేసవిలో పిల్లలకు ఏ డ్రై ఫ్రూట్స్ తినిపించాలో తెలుసుకోవాలి.
నిపుణులు ఏమంటున్నారు..
అత్తిపండ్లు, ఎండుద్రాక్ష, రేగు, నేరేడు, ఖర్జూరం వంటి అనేక డ్రై ఫ్రూట్స్ చలికాలంలోనే ఎంతో మేలు చేస్తాయని వైద్యనిపుణనులు చెబుతున్నారు. వాటిని రాత్రి నిద్రపోయే ముందు ఒక కప్పు నీటిలో నానబెట్టి, ఉదయం వాటిని తింటే శరీరంలో వేడిని ఉత్పత్తి చేయవు.
నీటిలో నానబెట్టి...
నీటిలో నానబెట్టడం వల్ల డ్రైఫ్రూట్స్ స్వభావం చల్లగా మారి ఆరోగ్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా జీడిపప్పు, బాదం పప్పులు, వాల్‌నట్‌లు మొదలైన వాటిని కూడా నీటిలో నానబెట్టి తినవచ్చు కానీ వీటిని తక్కువ పరిమాణంలో మాత్రమే పిల్లలకు ఇవ్వాలి.
మీ శరీరానికి ఎంత అవసరమో, మీ వయస్సు, పరిస్థితి ఏమిటో చూసిన తర్వాత డైటీషియన్లు డ్రై ఫ్రూట్స్ పరిమాణాన్ని నిర్ణయిస్తారని నిపుణులు అంటున్నారు. అందుకే మీరు పిల్లలకు డ్రై ఫ్రూట్స్ తినిపించాలనుకుంటే, దీని కోసం నిపుణుల నుండి సలహా తీసుకోవాలి.