సమ్మర్‌లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే కళ్లపై ఎఫెక్ట్ పడుతుందా?

by samatah |
సమ్మర్‌లో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే కళ్లపై ఎఫెక్ట్ పడుతుందా?
X

దిశ, వెబ్‌డెస్క్ : వేసవిలో చాలా మంది ఎండ తీవ్రత నుంచి బయటపడటానికి సన్ గ్లాసెస్ పెట్టుకుంటారు. అయితే ఇలా సన్ గ్లాసెస్ పెట్టుకోవడం కళ్లు దెబ్బతింటాయా అని చాలా మంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు.అయితే సన్ గ్లాస్ పెట్టుకోవడం వలన కంటి ఆరోగ్యం దెబ్బతింటుందని టిమ్ గ్రే అంటున్నారు.

ఎండ తీవ్రత కారణంగా సూర్యుని నుంచి వచ్చే కిరణాలను కళ్లు ఫిల్టర్ చేస్తాయి. ఎండగా ఉందని మెదడుకు తెలియజేసేందుకు కళ్లు పిట్యుటరీ & పీనియల్ గ్రంథులకు సంకేతాలు పంపుతుంది. చర్మం నేరుగా సూర్యరశ్మి నుంచి విటమిన్ D తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే సన్ గ్లాసెస్ ధరించడంతో పరిసరాలు మేఘావృతమయ్యాయని మెదడు భావించే అవకాశం ఉంది. దీంతో ఎండను తట్టుకునేలా చర్మానికి అవసరమైన సంకేతాలను మెదడు ఇవ్వదు’ అని టిమ్ చెబుతున్నారు. దీంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు.

సన్ గ్లాసెస్ ధరించడం వల్ల మనిషి శరీరంలోని సిర్కాడియన్ రిథమ్‌ దెబ్బతిని నిద్రలేమి సమస్యకు కారణమవుతుందంట. ఇది తీవ్రమైన అలసట, డిప్రెషన్, సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ వంటి సమస్యలకు దారితీయవచ్చునంట. అందు వలన సన్ గ్లాసెస్ ధరించకూడదు అంటూ ఇన్ స్టాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed