ఏ వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

by Jakkula Samataha |
ఏ వైపు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. మానవ శరీరంలో నిద్ర అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వ్యక్తి తప్పనిసరిగా ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి అంటారు వైద్యులు. అయితే కొంత మంది తమ వర్క్ బిజీ లైఫ్‌లో సరిగా నిద్రపోవడం లేదు. మరికొంత మంది మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వలన నిద్రపోవడం లేదు. ఇంకొంత మంది స్మార్ట్ ఫోన్‌కు బానిసై నిద్రకు భంగం కలిగిస్తున్నారు. కానీ సరైన సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

అయితే కొంత మందికి పడుకున్నాక అస్సలే నిద్ర పట్టదు. ఏ వైపు తిరిగి పడుకోవాలో కూడా తెలియదు. కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వైపు తిరిగి పడుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అలాగే త్వరగా నిద్రపడుతుంది. ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు వైద్యులు.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన జీర్ణక్రియ బాగుంటుందంట. ఎడమవైపు నిద్రిస్తున్నప్పుడు మీ కడుపు, ప్యాంక్రియాస్ యొక్క స్థానం మెరుగైన డ్రైనేజీని అనుమతిస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ప్రస్తుతం చాలా మంది మహిళలు సంతానలేమి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు ఎడమ వైపు తిరిగి పడుకోవడం చాలా మంచిదంట.

అంతే కాకుండే వెన్ను నొప్పితో బాధపడేవారు ఎడమవైపు తిరిగి పడుకోవడం మరీ మంచిదంట. ఇలా ఎడమవైపు తిరిగి పడుకోవడం వలన గుండె పనితీరు కూడా బాగుంటుంది అంటున్నారు నిపుణులు.మీ ఎడమ వైపున పడుకోవడం వల్ల మీ గుండె పై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. దీంతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే గుండె మీ శరీరానికి ఎడమవైపు ఉంటుంది, కాబట్టి మీ ఎడమ వైపున నిద్రపోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed