ఈ పండ్లను ఫ్రీజ్‌లో పెడుతున్నారా...? అయితే జాగ్రత్త

by Naresh |   ( Updated:2023-12-23 13:12:13.0  )
ఈ పండ్లను ఫ్రీజ్‌లో పెడుతున్నారా...? అయితే జాగ్రత్త
X

దిశ, వెబ్‌డెస్క్: మనం రోజు తినే కొన్ని ఫ్రూట్స్ ఎక్కువ కాలం ఉండటానికి మనం ఫ్రీజ్‌‌‌లో నిల్వ ఉంచుతాం. అయితే ఆపిల్, అరటిపండు, పుచ్చకాయ లాంటి పండ్లను ఫ్రీజ్‌లో పెట్టడం వలన అవి విషపూరితంగా మారుతాయని, ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లను ఫ్రీజ్‌లో ఉంచడం వలన వాటిలో ఉన్న ప్రొటిన్స్, విటమిన్స్ చనిపోయి అవి కుల్లిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి మన శరీరానికి హాని కలిగిస్తాయని అంటున్నారు.

అరటి పండ్లు:

మనకు తక్కువ ధరలో లభించే పండ్లలో ఒకటి అరటి పండ్లు. ఎక్కువగా అందరూ తినేది కూడా ఈ పండ్లే. అయితే అరటి పండ్లను ఫ్రీజ్‌లో పెట్టడం వలన అవి నల్లగా మారుతాయి. ఇందులోని ప్రొటిన్స్, విటమిన్స్ చనిపోవడం వలనే అవి నల్లగా మారి, విషంగా మారుతాయి. ఇవి మనం తినడం వలన అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ఫ్రీజ్‌లో పెట్టకుండా తినడమే మంచిది.

పుచ్చకాయ:

మనకు సమ్మర్‌లో అధికంగా లభించే వాటిలో ముఖ్యమైనది పుచ్చకాయ. ఇది మన శరీరాన్ని డ్రీహైడ్రేషన్ కాకుండా చూస్తుంది. అయితే చాలామంది పుచ్చకాయను సగం తిని మిగిలిన భాగాన్ని ఫ్రీజ్‌లో నిల్వ ఉంచుతారు. దీనిలో ఉండే కాల్షియం, సోడియం, పోటాషియం ఫ్రీజ్‌లో పెట్టడం వలన పోషకాలు మార్పుచెందుతాయి. ఇలా చేయడం వలన పుచ్చకాయలోని పోషకాలు చనిపోయి విషంగా మారుతుంది. వీటిని మనం తినడం వలన అనేక రకాల వ్యాధులు వ్యాప్తిస్తాయి.

ఆపిల్:

అందరూ ఎక్కువగా ఇష్టపడి తినే పండు ఆపిల్. ఇది సిజన్స్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది. అయితే అందరి ఇళ్లలోని ఫ్రీజ్‌లో కనిపించే పండు ఆపిల్. అయితే దీన్ని కవర్స్ లేదా ఏదైనా ప్లాస్టిక్ బాక్స్‌లో పెట్టడం మంచిది. ఫ్రీజ్‌లో ఉంచడం వలన ఇందులో ఉండే పోషకాలు, ప్రోటిన్స్, విటమిన్స్ కుల్లిపోయి విషంగా మారుతుంది.

మామిడి పండ్లు:

భారతదేశంలో అధికంగా పండే వాటిలో మామిడి పండ్లు ఒకటి. ఇవి వేసవి కాలంలో అధికంగా లభిస్తాయి. మామిడి పండ్లు ఫ్రీజ్‌లో పెట్డడం వలన వీటిలో ఉండే ఎ, బీ, సీ విటమిన్స్ నశించిపోతాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుముఖం పడుతాయి. అందువలన ఎక్కువ రోజులు ఫ్రీజ్ ఉంచడం వలన రోజు రోజుకు వీటిలోని పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి వీటిని ఫ్రీజ్ పెట్టకపోవడం మంచిది.

లిచీ:

మనకు అధికంగా లిచీ పండ్లు సమ్మర్‌లో దొరుకుతాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఆస్థామా, ఉబ్బసం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. వీటిని తినడం వలన బరువును కూడా నియంత్రించవచ్చు అయితే వీటిని ఫ్రీజ్‌లో పెట్టడం వలన పైన ఫ్రెష్‌గా ఉన్న లోపల కుల్లిపోతాయి. ఫ్రెష్‌గా ఉన్నప్పుడు తినడమే మంచిది.

సిట్రస్ పండ్లు:

కమల పండ్లు, లెమన్, జామ, దానిమ్మ, స్ట్రాబెరి, కివి లాంటి పండ్లలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. అందువలన వీటిని ఫ్రీజ్‌లో పెట్టడం వలన వీటిలోని సీ విటమిన్స్ చనిపోతాయి. అందువలన అవి విషంగా మారి మనం తిన్నప్పుడు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇతర కూరగాయాలు లేదా పండ్లను పెట్టిన అవి కూడా కుల్లిపోతాయి.

Advertisement

Next Story

Most Viewed