- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ వ్యాధులు ఉన్నవారు చెరకు రసం తాగితే ఎంత ప్రమాదమో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: గత ఏడాది వేసవితో పోలిస్తే ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంగుతున్నారు. అయితే ఎండాకాలం పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బందులకు గురిచేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది శీతలపానియాలను, పండ్ల జ్యూస్‌లను ఎక్కువగా సేవిస్తుంటారు. ముఖ్యంగా చెరకు రసాన్ని చిన్నా పెద్ద ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. చెరకు రసంలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలతో పాటు హాని తలపెట్టే కారకాలు కూడా ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఏయే వ్యాధులున్నవారు తాగకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
*మధుమేహంతో బాధపడేవారు చెరకు రసం తాగితే అందులో ఉండే చక్కెర స్థాయిలు పెరిగి ఇబ్బందులకు గురిచేస్తాయట. కాబట్టి అలాంటి వారు చెరకు రసానికి దూరంగా ఉండటం మంచిది.
*అలాగే చెరకు రసంలో అధికంగా పొటాషియం ఉంటుంది. ఇది కిడ్నీ సమస్యలు ఉన్నవారికి చాలా ప్రమాదం తలపెడతాయి.
* తలనొప్పి ఉంటే చెరకు రసం తాగడం వల్ల సమస్య మరింత పెరుగుతుంది. అంతేకాకుండా తల తిరగడం వంటి ఇతర ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది.
* జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉంటే చెరకు రసాన్ని తాగితే అంత మంచిది కాదు. అందుకే చెరకు రసానికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Read more: